Quote image editor
“చాలిక సున్నిత భావాల తొలకరి చినుకులు లేలేత పోలికల అలంకార హంగులు చాలిక గబ్బుమంటున్న గత ప్రస్థావనలు ఓటమిని ఎదుర్కోలేని భయాందోళనలు చాలిక నన్ను ఓడిస్తున్న సుకమైన అలసట నేనే.. రేపు చీదరించే నేటి మనుగడ ఇకపై నియంతనై నను నేను పాలించాలి పట్టువీడక ఆశపడినది సాధించాలి నాలోని సత్తువంతా బయట పెట్టాలి బ్రహ్మరాతను ధిక్కరించేలా నా ప్రతి అడుగు పడాలి kavithalu.in” — suresh sarika
చాలిక
సున్నిత భావాల తొలకరి చినుకులు
లేలేత పోలికల అలంకార హంగులు
చాలిక
గబ్బుమంటున్న గత ప్రస్థావనలు
ఓటమిని ఎదుర్కోలేని భయాందోళనలు
చాలిక
నన్ను ఓడిస్తున్న సుకమైన అలసట
నేనే.. రేపు చీదరించే నేటి మనుగడ
ఇకపై
నియంతనై నను నేను పాలించాలి
పట్టువీడక ఆశపడినది సాధించాలి
నాలోని సత్తువంతా బయట పెట్టాలి
బ్రహ్మరాతను ధిక్కరించేలా
నా ప్రతి అడుగు పడాలి
kavithalu.in